కరోనా మహమ్మారి చైనాలో మళ్లీ విజృంభిస్తోంది. రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. అయితే , చైనాలో సంభవిస్తున్న కరోనా మరణాలపై చైనా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, మరణాలు దాచిపెడుతోందని WHO ఆరోపించింది. చైనా తీరు చూస్తుంటే ఆ దేశంలో కరోనా ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపింది. కొత్త వేరియంట్ బయటపడ్డ విషయాన్ని కూడా చైనా తమ రిపోర్టులో వెల్లడించలేదని WHO తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa