చాలామంది బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ రెగ్యూలర్‌గా మానేస్తుంటే కొన్ని రోజులకి రక్తహీనత సమస్య బారిన పడతారు. తరచుగా బ్రేక్‌ఫాస్ట్ మానేసే వారిలో జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఆల్కాహాల్ సేవించిన వారు ఉదయం అల్పాహారం తినకపోతే హ్యాంగోవర్ సమస్య అధికం అవడంతో పాటు షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోతాయి.