ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల విషయంలో భారత్ నెం.1 స్థానంలో ఉందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ప్రపంచంలోనే సాఫ్ట్ వేర్ డెవలపర్లను పరిశీలిస్తే భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని ఆయన వెల్లడించారు. రాబోయేది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రానున్న రెండేళ్లు.. సాంకేతిక రంగానికి అత్యంత సవాలుగా మారనున్నాయని ఉద్ఘాటించారు.