దేశంలో నిరుద్యోగం కారణంగానే పెళ్లీడుకొచ్చినా యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని ఎన్ సీపీ చీఫ్ శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుందని అన్నారు. ఉపాధి లేక యువకులకు అమ్మాయిలను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. బాగా చదువుకున్న వారు తమకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వాలను నిలదీయాలని సూచించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు.