వరుసగా రెండోరోజూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గే వరకు రేట్ల పెంపు కొనసాగుతుందన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటన మార్కెటకు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 304.18 పాయింట్ల నష్టంతో 60,353.27 దగ్గర, నిఫ్టీ 50.80 పాయింట్లు కోల్పోయి 17,992.15 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.46 వద్ద నిలిచింది.