జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని రాణీ వనంలో ఉన్న ఎంబిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో గురువారం పెన్షన్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్ లబ్ధిదారులకు జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి చేతుల మీదుగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఫింఛన్ కానుక నూతన సంవత్సర శుభాకాంక్షలతో అవ్వా, తాతలకు అక్క చెల్లెమ్మ లకు ప్రేమతో 2, 500 నుంచి 2, 750 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, మూలె సురేంద్ర నాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa