స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని స్నేహిత అమృత హస్తం సేవాసమితి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. పులివెందుల పట్టణం లోని సిఎస్ఐ చర్చి మైదానంలో ఈ నెల 10 వ తేదీ మంగళవారం స్పోర్ట్స్ మీట్ లో భాగంగా పులివెందుల నియోజవర్గంలోని పురుషులకు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు మొమ్మెల రాజు ఒక ప్రకటనలో తెలిపినారు. ఈ పోటీలకు 15నుండి 29 సంవత్సరాల వయసు గల యువకులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. గెలుపొందిన విజేతలకు ప్రధమ 3వేలు, ద్వితీయ 2వేలు బహుమతులు ఉంటాయని రాజు తెలిపారు మరియు ప్రోత్సాహక బహుమతులు కలవు కావున ఆసక్తి గలవారు వారు జనవరి 9 వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని, 10 వ తేదీ ఉదయం 8 గంటల నుండి సిఎస్ఐ చర్చి మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించబడును. ఆసక్తి గలవారు 9966509364 కి సంప్రదించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa