ప్రజల దగ్గరకు వెళ్ళేహక్కు ప్రతీ పార్టీకి ఉందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ అంబేద్కర్ విగ్రహం వద్ద జీఓ - 1 కాపీలను ఎమ్మెల్యే తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చీకటి జీవో కనుక తాము ఈ జీఓను తగులబెడుతున్నామన్నారు. చంద్రబాబు సభలకు లక్షలాది మంది వస్తున్నారని అన్నారు. యువగళం కార్యక్రమానికి జడిసి ఇలా చేస్తున్నారని విమర్శించారు. జీఓ-1 ను రద్దు చేయాలని, తక్షణమే నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పులివెందులలో గెలిచి బోణీ చేయగలరా అంటూ గద్దె రామ్మోహన్ సవాల్ విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa