భార్యపై కోపంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అమెరికాలోని నోచ్ సిటీలో మైఖెల్ అనే వ్యక్తి తన భార్య, ఐదుగురు పిల్లలు, అత్తతో కలిసి నివసించేవాడు. మనస్పర్థల కారణంగా మైఖెల్ భార్య విడాకులకు అప్లై చేసింది. దీంతో కక్ష పెంచుకున్న అతను విచక్షణా రహితంగా ఏడుగురు కుటుంబీకులపై కాల్పులు జరిపాడు. అనంతరం తానూ కాల్చుకుని చనిపోయాడు. మృతుల్లో నాలుగేళ్ల పాప కూడా ఉంది.