విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి శుక్రవారం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలివారు. ఢిల్లీ శివారు గుర్గావ్ లో పీడబ్ల్యూడీ బంగ్లాకు వెళ్ళి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు. వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. యాగంలో రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో లక్ష సార్లు హవనం జరుగుతుందని వివరించారు. ఉత్సవాలలో పాల్గొని రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని అన్నారు. అలాగే హర్యానాలో కురుక్షేత్ర వద్ద గుంతిధామ్ లో ఫిబ్రవరి 11 నుండి 16 రోజులపాటు లక్ష చండీ యాగం నిర్వహిస్తున్నట్లు వివరించారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో సాగే యాగంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని, యాగ నిర్వహణకు సహకరించాలని హర్యానా సీఎం ఖట్టర్ ను కోరారు.