వైకాపా మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నియమితులయ్యారు. ఈ మేరకు వైకాపా కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. వైకాపా ఆవిర్భావం నుంచి, ఆ పార్టీలో క్రియాశిలక పాత్ర పోషిస్తూ ఉన్న కళ్యాణి కి సీఎం మరోసారి రాష్ట్ర స్థాయి పదవి అప్పగించారు. అంచలంచెలుగా పార్టీలో, వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. ఆమె పార్టీకి చేసిన సేవలు గుర్తింపుగా 2021లో విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తనను నియమించిన వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ నేతలకు కళ్యాణి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానాని ఆమె పేర్కొన్నారు.