ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా అధికారులు సహకరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 07, 2023, 03:06 PM

జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా అధికారులు సహకరించాలని పాతపట్నం ఇన్‌ చార్జి జూనియర్‌ సివిల్‌జడ్జి ఎంఎస్‌హెచ్‌ఆర్‌ తేజ చక్రవర్తి అన్నా రు. స్థానిక జూనియర్‌ సివిల్‌ జడి ్జకోర్టులో శుక్రవారం పోలీసు అధికారులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 11న నిర్వ హించనున్న లోక్‌ అదాలత్‌పై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించా లన్నారు. కక్షిదారులు దీనిని వినియోగించుకునేలా చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీపీ జి.ప్రియదర్శిని, సీఐ ఎం.వినోద్‌ బాబు, ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు, న్యాయవాదులు సలాన దండాశి, గేదెల ఫల్గుణరావు, డా.జి.రాజేశ్వరరావు, బీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com