సంక్రాంతి కానుకగా చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ నటించిన 'వీరసింహా రెడ్డి' సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కీలక ట్వీట్ చేశారు. 'సంక్రాంతికి విడుదల కానున్నవీరసింహా రెడ్డి,వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు హిట్ అవ్వాలి. మా పార్టీకి చెందినవారు వేరే పేర్లతో తప్పుడు రివ్యూలు రాస్తారు. ఒకరి ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ మరొకరిపై విమర్శలు గుప్పిస్తారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలి' అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.