దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది వణుకుతుంది. 1.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు కారణంగా ఆదివారం 88 రైళ్లు రద్దయ్యాయని, 335 రైళ్లు, 20 విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. చలి వల్ల గడ్డ కట్టే పరిస్థితులు ఉండటంతో, ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సూచించారు. ఢిల్లీ సహా కొన్ని నిర్దిష్టమైన ఉత్తరాది ప్రాంతాలకు ఐఎండీ ‘ఆరెంజ్’ అలర్ట్‌ను జారీ చేసింది.