తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొద్ది నెలల్లోనే అధికారం చేపట్టిన నందమూరి తారక రామారావు 1983 జనవరి 9న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకాన్ని తెలుగుతేజం నందమూరి తారక రామారావు గారు సగర్వంగా ఎగరవేసిన రోజు తెలుగుదేశానికి పర్వదినం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన మహానేత నందమూరి తారకరామారావు అని కీర్తించారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9 నిజమైన పండుగ రోజు అని అన్నారు. తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగు దేశం ఉంటుందని నారా లోకేష్ అన్నారు.