రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తుల బదలాయింపుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆస్తుల పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని ఏపీ తన పిటిషన్ లో పేర్కొంది. ఆస్తుల విభజన న్యాయంగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే నేటి విచారణకు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతోపాటు కౌంటర్‌పై రిజయిండర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.