దేశవ్యాప్తంగా ఉన్న శాసనసభల అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశం రాజస్థాన్ శాసనసభలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన బుధవారం నుండి జరగనుంది. రాజస్థాన్ శాసనసభ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సును బుధవారం ఉదయం 10:15 గంటలకు భారత ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రారంభించనున్నారు.అధికారిక ప్రకటన ప్రకారం, ప్రారంభోత్సవ వేడుకలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మరియు రాజస్థాన్ శాసనసభ స్పీకర్ సీపీ జోషితో పాటు బిర్లా ప్రసంగిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa