రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే దిశ యాప్ మహిళలకు ఎంతగానో రక్షణ కవచంలా ఉంటుందని రాష్ట్ర హో మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం ఆగిరిపల్లి లోని నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ దిశ యాప్ ద్వారా ఇప్పటికీ 900 మహిళలు రక్షణ పొందారన్నారు. మహిళలను గౌరవిస్తూ వారికి సముచిత స్థానం కల్పించడమే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేట్ తక్కువగా ఉండటం అభినందనీయమన్నారు. ఏలూరు రేంజ్ డిఐజి పాల్రాజు మాట్లాడుతూ అన్ని హంగులతో సాంకేతిక
పరికరాలతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టటం అభినందనీయమన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ 1987లో ఆగిరిపల్లిలో స్టేషన్ ఏర్పాటు ఆనాటి నుంచి పురాతన రేకుల షెడ్డులో కొనసాగుతూ నేడు అన్ని అంగులతో స్టేషన్ నిర్మించుకోవడం శుభ పరిణామం అన్నారు. సభకు అధ్యక్షత వహించిన నూజివీడు శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధులతో పాటు దాతల సహకారంతో పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు.
జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి ప ఎమ్మెలే ప్రతాప్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సహకరించిన దాతలను. హోంమంత్రి తానేటి వనిత ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముందుగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని అనురాధ నేతృత్వంలో చిన్నారులు ఆలపించిన గేయాలు పలువురిని మంత్రముగ్ధులు చేశాయి. కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేష్ తాసిల్దార్ ఉదయభాస్కరరావు, ఎండిఓ. సుహాసిని, ఎంపీపీ గొళ్ల అనూష, జన్పీటిసి పిన్నిబోయిన వీరబాబు, ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో పాటు గ్రామస్తులు మహదానందంగా ఉందన్నారు. పాల్గొన్నారు.