చిరు వ్యాపారులు వారి కష్టంపైనే ఆధారపడతారు. పెట్టుబడికి ఇబ్బంది కాకూడదనే జగనన్న తోడు పథకాన్ని తెచ్చామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చిరు వ్యాపారులు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. రుణాలు పొందిన వారిలో 80 శాతంమంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అన్నారు. ఇప్పటి వరకు 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని చెప్పారు. గతంలో వీరి చేయిపట్టుకుని నడిపించే పరిస్థితి లేదు. వార్డుల్లో , గ్రామాల సచివాలయాల్లో వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు వీరికి తోడుగా నిలబడుతున్నారు. లబ్ధిదారులను గుర్తించండం దగ్గర నుంచి, వీరి దరఖాస్తులు తీసుకోవడం దగ్గరనుంచి, బ్యాంకులతో మమేకం కావడం, రాష్ట్రస్థాయిలో బ్యాంకర్లతో మాట్లాడ్డం, వారిని ఒప్పించడం, పారదర్శక విధానంలో లబ్ధిదారులను గుర్తించాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వడ్డీ చెల్లించే బాధ్యత తీసుకుంటూ... నమ్మకం కలిగింది అని సీఎం జగన్ అన్నారు.