రమణ మహర్షి శిష్యులు శ్రీ స్వామి వివేకానంద జన్మదినం పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం లో ఆయన జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించి ఆయన కోసం ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు.
అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్ఫై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించింది. అటువంటి మహోన్నత వ్యక్తి జన్మదినం సందర్భంగ ఆయనను స్మరించుకుంటూ ఆనందపురం గ్రామంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి స్వచ్ఛంద సంస్థలు అయినటువంటి ఓ ఎస్ జి ఫౌండేషన్ శివ దళాయి, విబీ హ్యుమానిటీ ఫౌండేషన్ వెంకట్, అల్లూరి సీతారామరాజు ఫౌండేషన్ అరవింద్ చక్రి లోకేష్, జై జవాన్ ఫౌండేషన్ రాజశేఖర్ రామలక్ష్మి ముడసల శ్రీను లోకేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. యువతను ఉద్దేశించి ఇటువంటి మహనీయుల జన్మించిన పర్వదినాలను పురస్కరించుకోవడం నేటి యువతకు ఎంతో అవసరమని ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు.