అనంతపురం జిల్లా, కణేకల్లు, మండలంలోని రచ్చుమర్రి, అంబాపురం గ్రామాల మధ్య నెలకొన్న దేవరపోతు సమస్య పోలీసుల జోక్యం తో సర్దుమణిగింది. రాయదుర్గం రూరల్ సీఐ యుగంధర్ బుధవా రం ఇరుగ్రామాల పెద్దలను స్టేషన్లో కూర్చొబెట్టి సమస్య పరిష్కా రం దిశగా చేసిన ప్రయత్నం సఫలీకృతం అయింది. త్వరలోనే అంబాపురంలో దేవర ఉన్నందున ప్రస్తుతం ఒకే ఒక్క దున్నపో తును అంబాపురం గ్రామస్థులకు అప్పగించాలని రచ్చుమర్రి గ్రామానికి అవసరమైన దున్నపోతును అంబాపురం గ్రామస్థులు తమ ఖర్చుతో నూతనంగా కొనిపెట్టేలా ఒప్పందం కుదుర్చారు. దీంతో ఇరుగ్రామాల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.