కులాల ఔన్నత్యం పెరుగుతున్న తరుణంలో 675 కులాలుగా ఉండి భౌగాళికంగా విడిపోయిన తెలుగుజాతిని ఐక్యం చేసేందుకు సాంస్కృతిక తెలుగు సేన ముందుకు రావడం జరిగిందని విప్లవ కవి, గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. తెలుగు సేన పేరుతో తెలుగు సాంస్కృతిక సైన్యంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. తెలుగు సేన ఆధ్వర్యంలో వైజాగ్ జర్నలిస్టు ఫోరంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సేన అధ్యక్షుడు సత్యారెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న తేదీన హైదరాబాదులో బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పది రాష్ట్రాలలో భారీ బహిరంగ సభలు, బస్సు యాత్రలు, రోడ్ షో లు కొనసాగుతాయన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాలలో సాగుతుందన్నారు.
ప్రస్తుతం కులాలవారీగా విడిపోతున్న తరుణంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఒక జాతిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శబ్దాన్ని అక్షరంగా మలుస్తూ ఉత్పత్తి, జ్ఞాన పదం, అభ్యుదయపదంగా అక్షరాన్ని విప్లవపదంగా మార్చగల అక్షర శిల్పి జర్నలిస్టులని కొనియాడారు. నేడు సమాజంలో 675 కులాలుగా విడిపోయిన తెలుగు వారిని ఐక్యం చేయడమే తమ లక్ష్యం అన్నారు. కాస్ట్ ఐడెంటిటీ ఎదుర్కోవడానికి తెలుగుజాతి ఐడెంటిటీ తీసుకువద్దామని కోరారు. స్మార్ట్ ఫోన్ గ్లోబలైజేషన్ తో ప్రపంచమంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని అన్నారు. అనంతరం అమ్మ నీకు వందనం. ఓ తెలుగు తల్లి నీకు వందనం అంటూ. గద్దర్ తన గలాన్ని విలపించారు. గౌరవ అతిథిగా హాజరైన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు,
వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతిని ఒక తాటిపైకి తీసుకురావడం కోసం తెలుగు సేన అధ్యక్షుడు సత్యారెడ్డి ఆధ్వర్యంలో మంచి సంకల్పంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి గద్దర్ ముందుండి నడిపించడం అభినందనీయమన్నారు. తెలుగువారి గొప్పతనాన్ని విశిష్టతను, అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గద్దర్ ప్రాధాన్యత అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఆయన పాట రూపంలో అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, ఆయన గళం అనేక సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిందన్నారు. ఇటువంటి భారీ కార్యక్రమం విశాఖలో ప్రకటించడం సంతోషదాయకమన్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా సుఖసంతోషాలతో ఉండాలని, సంక్రాంతి పండుగ ముందు ఇటువంటి మంచి కార్యక్రమం వివరాలు తెలియజేయడం శుభ సూచకమన్నారు.
దేశభక్త కార్యక్రమంలో భాగంగా చివరగా విశాఖ వచ్చినప్పుడు సాగర స్వాగతం పలుకుతామని శ్రీనుబాబు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకుడు తెలుగు సేన జాతీయ అధ్యక్షుడు సత్యారెడ్డి మాట్లాడుతూ ప్రజా యుద్ధనౌక గద్దర్ ముఖ్యఅతిథిగా ఫిబ్రవరి 10 హైదరాబాదులో భారీ ఎత్తున ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. చిన్నారులు తెలుగు భాష కోసం చేసిన చిన్నారులు చేసిన నృత్యం మాకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. దశాబ్దం కాలంగా తెలుగు సేన దేశంలోనే పలు రాష్ట్రాలలో వివిధ కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. నేటికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే స్కూల్ ఆఫ్ థియేటర్స్ కొరియోగ్రాఫర్ నాగరాజు పట్నాయక్ ఆధ్వర్యంలో చిన్నారులు ఆర్. హెచ్. టినా, పూజిత చందన, నిత్యసంతోషిని వైష్ణవి, చేసిన జ్ఞానపద, తెలుగు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'పాడన తెలుగు పాట. ' కు చేసిన నృత్యం పట్ల గద్దర్ చిన్నారులను ప్రశంసించారు. ఈ సమావేశంలో వీజేఎఫ్ ఉపాధ్యక్షుడు, స్కూల్ ఆఫ్ థియేటర్ కొరియోగ్రాఫర్ నాగరాజు పట్నాయక్, మెడిటేషన్ టీం ఎన్. రమేష్ కుమార్, జీ వరప్రసాద్, ఏయూ స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు బి అశోక్ కుమార్, ఎస్. పి. ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.