ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో ప్రారంభమైన ఇంట్రాసిటీ హెలికాప్టర్ సేవలు

national |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 08:20 PM

మన తెలుగు రాష్ట్రాల్లో రాజధాని నగరాలకు వచ్చినా ఒక చోటినుంచి మరో చోటికి పయనించేందుకు బస్సులను ఆశ్రయిస్తాం. కానీ బెంగుళూరు వాసులకు  ఆ కష్టాలు తీరుతున్నాయి. బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం, హోసూరు ఏరోడ్రోమ్ ను కలుపుతూ ఈ సేవలను ప్రవేశపెట్టారు. ఫ్లైబ్లేడ్ ఇండియా, హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ సంస్థలు జాయింట్ వెంచర్ గా ఈ సేవలను ప్రారంభించాయి. ఈ సేవల కోసం ప్రతి వారంలో ఒక్కొక్కరికి రూ. 6 వేల చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. హోసూరు నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడానికి రోడ్డు మార్గంలో 3 గంటల సమయం పడుతోంది. హెలికాప్టర్ ద్వారా 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. నిన్నటి నుంచి బ్లేడ్ ఇండియా వెబ్ సైట్ లో హెలికాప్టర్ సేవల బుకింగ్స్ తెరిచారు. 2019లో బ్లేడ్ ఇండియా సేవలను  ప్రారంభించింది. మహారాష్ట్రలో ముంబై, పూణె, షిర్డీల మధ్య ఈ సంస్థ హెలికాప్టర్లను నడుపుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com