నేటి నుండి భారత్ వేదికగా 15వ వరల్డ్ కప్ జరగనుంది. ఒడిషాలోని భువనేశ్వర్, రూర్కెలా స్టేడియాల్లో 17 రోజల పాటు మొత్తం 44 మ్యాచులు జరగనున్నాయి. భువనేశ్వర్ స్టేడియంలో 24 మ్యాచ్ లు, రూర్కెలాలో 20 మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 16 దేశాలు ఈ ప్రపంచకప్ లో పాల్గొంటున్నాయి. నేడు తొలి మ్యాచ్ లో అర్జెంటీనా, దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ లో భారత్, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. జనవరి 29న ఈ ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది.