ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారులు తనను వేధించారని సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఓ మహిళ ఆరోపించారు. 2021 పాక్ లోని ఓ కాలేజీలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నించినట్లు తెలిపారు. అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారనీ, కోరిక తీరిస్తే 24 గంటల్లోనే వీసా ఇస్తామని చెప్పారని తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని తనను అడిగి, డబ్బు ఇస్తామంటూ ప్రలోభపెట్టారని చెప్పారు.