చైనా వ్యాపార దిగ్గజం జాంగ్ లీ తన సొంత ఇంటినే జైలుగా మార్చుకున్నాడు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, తనను అమెరికాకు అప్పగించడంపై కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో లండన్ జైలులో ఉండేందుకు నిరాకరించిన ఈ చైనా టైకూన్, సొంత లగ్జరీ అపార్టుమెంట్‌లోనే తనను తాను నిర్బంధించుకున్నారు. బెయిల్ అంశం తేలేవరకు జాంగ్ లీ తన ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని జాంగ్ లీ లాయర్స్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.