ఆఫ్ఘనిస్తాన్ తో ఆడాల్సిన సిరీస్ ను క్రికెట్ ఆస్ట్రేలియా బహిష్కరించడంపై అఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఘాటుగా స్పందించాడు. తమ దేశానికి ప్రస్తుతం ఉన్న ఏకైక ఆశాకిరణం క్రికెట్ అని, ఆటను రాజకీయాలకు దూరంగా ఉంచండి అని అన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో ఆడటం ఆస్ట్రేలియాకు అసౌకర్యంగా ఉంటే తాను బీబీఎల్ లో ఆడాలో లేదో అన్న అంశంపై కఠినంగా నిర్ణయం తీసుకుంటానని రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు.