మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరికకు రంగం సిద్థమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఈనెల 18వతేదీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. వైసీపీలో వున్న కాండ్రు కొంత కాలంగా ఆపార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు, సముచిత స్థానం లభించలేదని కాండ్రు శ్రీనివాసరావు అన్నారు. ఏపీ అభివృద్థి టీడీపీ కే సాధ్యమని భావించి ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.