తోట్లవల్లూరు మండలంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జూదాలకు, కోడిపందేలకు చెక్ పెట్టాలనే ఆదేశంతో అధికారులు సమీక్ష, సమావేశాలు నిర్వహించారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో రెవిన్యూ అధికారులు, పోలీసు అధికారులు, వెటర్నరీ డాక్టర్, ఇ. ఒ. పి. ఆర్. డి. పలు అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని తహశీల్దారు కె. వి. శివయ్య నిర్వహించారు.
ఈ సమీక్షలో కోడిపందాలు, జూదాలు నివారించేందుకు పర్వదిన సమయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన తెలిపారు. దీని కోసం వి. ఆర్. ఒ. మహిళా పోలీసు, విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్, కానిస్టేబుల్తో విలేజ్ లెవెల్ టీంని నియమించామని, మండల లెవెల్ టీంను కూడా నియమించడం జరిగిందని, మండల లెవెల్ టీంలో తహశీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, వెటర్నరీ డాక్టర్, ఇ. ఒ. పి. ఆర్. డి ఉంటారని గ్రామాలలో కోడిపందాలు, పేకాట ఆడేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని గేమింగ్ యాక్ట్ ప్రకారం కోడిపందాలను ఆడినవారి పై కేసులు నమోదు చేసేందుకు విలేజ్ లెవెల్ మరియు మండల లెవిల్ సభ్యులు విజిట్స్ చేయాలని చెప్పారు. పైన తెల్పిన ఉద్యోగస్తులందరూ సంక్రాంతి సెలవులు లేకుండా బాధ్యతగా తమ డ్యూటీలను చేయాలని తహశీల్దార్ పేర్కొన్నారు.