మరుగున పడుతున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడానికి సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇచ్చాపురం మండలంలోని భవానిపురం అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఒ నాగరాణి ఆధ్వర్యాన గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. చిన్నారులకు సంక్రాంతి, మన సంస్కృతిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ నీలవేణి, రాము, బర్రి నరసమ్మ పాల్గొన్నారు.