కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ తదుపరి మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదని మాజీ లెజెండ్ చెప్పారు. రెండో వన్డేకు ముందు భారత ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గాయపడటంతో కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత కుల్దీప్‌కు అవకాశం వచ్చిన బంతితో అదరగొట్టాడు. మూడు కీలక వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించాడు. కుల్దీప్ తన ఆశీర్వాదం పొందిన ఈడెన్ గార్డెన్స్‌లో విరుచుకుపడ్డాడు. భారత్ ఇక్కడ ఆడిన చివరి వన్డేలో కుల్దీప్ కూడా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్ తీసుకొని భారత్‌ను గెలిపించాడీ స్పిన్నర్. మళ్లీ ఇప్పుడు అవకాశం రావడంతో సత్తా చాటాడు. అయితే అతడు ఇంత అద్భుతంగా రాణించినా.. తదుపరి మ్యాచ్‌లో ఆడడం అనుమానమే అని మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా అన్నాడు. టెస్టు రీఎంట్రీలో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న కుల్దీప్‌ని చోప్రా ఎత్తిచూపాడు. కుల్దీప్ యాదవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఒక సింపుల్ రూల్ పెట్టుకున్నాడు. తనకు అవకాశం ఇస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసేసుకుంటాడన్నమాట' అన్నాడు.
కుల్దీప్ తన ఆశీర్వాదం పొందిన ఈడెన్ గార్డెన్స్‌లో విరుచుకుపడ్డాడు. భారత్ ఇక్కడ ఆడిన చివరి వన్డేలో కుల్దీప్ కూడా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్ తీసుకొని భారత్‌ను గెలిపించాడీ స్పిన్నర్. మళ్లీ ఇప్పుడు అవకాశం రావడంతో సత్తా చాటాడు. అయితే అతడు ఇంత అద్భుతంగా రాణించినా.. తదుపరి మ్యాచ్‌లో ఆడడం అనుమానమే అని మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా అన్నాడు. టెస్టు రీఎంట్రీలో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న కుల్దీప్‌ని చోప్రా ఎత్తిచూపాడు. కుల్దీప్ యాదవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఒక సింపుల్ రూల్ పెట్టుకున్నాడు. తనకు అవకాశం ఇస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసేసుకుంటాడన్నమాట' అన్నాడు. అయితే వచ్చే మ్యాచ్‌కు యుజ్వేంద్ర చాహల్ కనుక ఫిట్‌గా ఉంటే కుల్దీప్‌ను పక్కన పెట్టేస్తారని చోప్రా అభిప్రాయపడ్డాడు