ఆంధ్రా-ఒడిసా సరిహద్దు ప్రాంతంలో మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు విశాఖ రేంజ్ డీఐజీ ఎస్.హ రికృష్ణ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం కవిటి పోలీస్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ఎస్ఈబీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటు న్నట్లు చెప్పారు. శ్రీకాకుళంలో హైవేపై ప్రమాదాల నివారణకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, ఇచ్ఛాపురం సీఐ ఆర్.ఈశ్వరచంద్ర ప్రసాద్, ఎస్ఐ కె.రాము పాల్గొన్నారు.