ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండగపూట మా కార్యకర్తలను జైల్లో పెట్టావ్.. భవిష్యత్‌లో నువ్వు ఎక్కడ ఉంటావో ఊహించుకో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 11:36 AM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పెద్దిరెడ్డి కి వార్నింగ్‌ ఇచ్చారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘‘పండగపూట మా కార్యకర్తలను జైల్లో పెట్టావ్.. భవిష్యత్‌లో నువ్వు ఎక్కడ ఉంటావో ఊహించుకో.. ఈ భూమిపై ఎక్కడున్నా తీసుకొస్తా.. వదలను.. ఇంతవరకు నా సున్నితత్వం చూశారు, ఇకపై కఠినాన్ని చూస్తారు.. వడ్డీతో సహా అంతా తీర్చుకుంటాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో ఇంత అరాచకాలను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. పోలీసులను ఉపయోగించుకుని నేరాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో అధికశాతం మంది ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా చితికిపోయారన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని.. పేటీఎం బ్యాచ్ చెలరేగిపోతోందని మండిపడ్డారు. మైనార్టీల భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని, పిల్లల భవిష్యత్‌ నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com