చిత్తూరు జిల్లాలో రహదారుల కోసం భూ సేకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం జాతీయ రహదారులు రైల్వే లైనులు కు సంబంధించి భూ సేకరణ గురించి వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్లు మరియు జాయింట్ కలెక్టర్లతో నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి భూ సేకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అదే విధంగా కడప బెంగళూరు రైల్వే లైన్ కు సంబంధించి ఇప్పటికే సర్వే పనులు పూర్తి అయ్యాయని త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతి కావాలని కోరడం జరిగింది. బెంగుళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి కౌండిన్య అటవీ ప్రాంతంలో అనుమతులు కోసం మిగతా ప్రాంతాల్లో దాదాపుగా పూర్తి అయిందని వివరించారు. చిత్తూరు నాయుడుపేట ఆరు లైన్ల రహదారికి సంబంధించి 1. 13 కిలోమీటర్ల మేరకు భూ సేకరణ చేయాల్సి ఉందని కోర్టు కేసులు పెండింగ్లో ఉందని వివరించారు.
చిత్తూరు_తచ్చురు రహదారికి సంబంధించి కొన్నిచోట్ల భూ సేకరణ పెండింగ్ లో ఉందని వివరించారు. వేగవంతంగా భూ సేకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మరోవైపు రహదారుల నిర్మాణం కూడా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు.