హిందువులకేకాక యావత్ భారతీయులకు ఎంతో ప్రాధాన్యమైన పండగ భోగి అని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం భోగి సందర్భంగా శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ మరియు ఆర్ట్స్ కళాశాల బృందం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన భోగి పండగ కార్యక్రమంలో భాగంగా ముందుగా సంప్రదాయబద్ధమగా భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు మాజీ గవర్నర్ జి. ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ, ప్రాచీన కాలం నుండి ఆచారంగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండేందుకు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తొలిపంట ఇంటికి చేరి, రైతన్నలు హృదయాల్లో ఆనందాలు విహరింపజేస్తుందని అన్నారు. తెలుగు ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని, భోగి పండగ సంక్రాంతి ముందు వస్తుందని , దీన్ని వైభవంగా వాడ వాడలా జరుపుకోవటం అనాది కాలం నుండి వస్తుందన్నారు. క్రిమి కీటకాలు నాశనం చేసే శక్తి ఒక్క భోగి పండగకు మాత్రమే ఉందని, ఆవు పేడతో తయారుచేషే భోగి పిడకల్లో చాలా ఔసుధగుణాలు ఉన్నాయని, వాటిని మంటల్లో వేయటం వల్ల అవి కాలి. తద్వారా వొచ్చే పొగవల్ల క్రిమి కీటకాలు నాశనమౌతాయన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు మాట్లాడుతూ. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే మకర సంక్రాంతి, భోగి , కనుమ పండగలు ప్రతీ ఒక్కరూ సంప్రదాయ బద్దంగా చేసికొని, సుఖశాంతులతో జీవించాలని ఆకాక్షించారు. రోటరీ క్లబ్ ప్రతినిధి ఐకె. రావు మాట్లాడుతూ. గడిచిన రెండుమూడేళ్లు కాలంలో కరోనా వంటి మహమ్మారి ప్రభావంతో అతలాకుతలమైపోయిన ప్రజానీకం, ఈ ఏడాది ఎటువంటి కరోనా భయం లేకపోవడంతో ఎంతో అట్టహాసంగా, సందడిగా భోగి పండగ జరుపుకున్నారన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకొనే పండగ సంక్రాంతి, భోగి, కనుమపండుగలన్నారు. నవగ్రహ దోషాలు తొలగి, భోగభాగ్యాలు కలగాలని ఆయన అభిలసించారు.