జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పీ. జీ. వి. ఆర్ నాయుడు గణబాబు సూచన మేరకు పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం ఏడు గుడులు వద్ద శనివారం భోగీ వేడుకలు నిర్వహించారు.
ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ -1 ను వెంటనే రద్దుచేసి ప్రజాస్వామ్య విలువలను కాపా డాలని భారత రాజ్యాంగ విలువ లను తుంగలో తొక్కుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ ఒకటి కరపత్రాలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.
కార్యక్రమం లో నీలపు జోగి సర్వసిద్ది శ్రీలక్ష్మి మాజీ సోమేష్, మతా శ్రీను, నక్క లక్ష్మణ రావు, పోతాబత్తుల శ్రీనివాస్ కొరిబిల్లి రాము, జై శంకర్, అది, రాము, శ్రీనివాస్, పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.