ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం కరకట్ట కింద కోడిపందాల బరిని సిద్ధపర్చగా, పందాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఘంటసాల మండలంలో మూడు బరులను ఏర్పాటు చేయగా, పోలీసులు మూడు రోజుల నుంచి తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చివరి రోజు చేతులెత్తేయడంతో శనివారం కోడిపందాలు నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పందెపు రాయుళ్లు వచ్చి జోరుగా పందాలు వేస్తున్నారు.