మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. కేవలం హిందువులు చేసుకున్న వివాహాలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని తెలిపింది. 2017లో ఓ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరిపిన కేఎం జోసఫ్, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు ఇచ్చింది.