గురుధాం ధర్మక్షేత్రంలో సనాతన సాంప్రదాయం ప్రకారం సోమవారం సంక్రాంతి పర్వదిన వేడుకలు జరిగాయి జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామ సమీపంలోని గురుదాములో ప్రముఖ తాత్వికులు వెంకటరమణ దంపతులు భోగి పర్వదిన సందర్భంగా సాంప్రదాయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆవరణలో పాత వస్తువులు కట్టెలతో భోగిమంటలను వేసి భోగి విశిష్టతను భక్తులకు తెలియజేశారు.
సంక్రాంతి పర్వదినం రోజు ఏ ఏ పిండి వంటలు చేసుకోవాలి వాటి వల్ల మన ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని పండుగల విశిష్టత ఏ ఏ మాసాలలో ఏ ఏ పండుగలు జరుపుకుంటాం పండుగలకు సైంటిఫిక్ గా మనం జరుపుకునే విధానానికి ఉన్న సంబంధాన్ని భక్తులుకు అనుగ్రహ సంభాషణ నిర్వహించారు కనుమ పండుగ సందర్భంగా ప్రతి ప్రాణికి జీవించడానికి ముఖ్యమైనది ఆహారం అటువంటి ఆహారాన్ని అందించటానికి అన్నదాతలకు అండగా పొలాల్లో నిరంతరం చేదోడువాదోడుగా ఉండే వృషభరాశులకు ఎద్దులకు ఆవులకు ఇతర జీవరాసులకు మన పండుగలో విశిష్టత ఉందని తెలియజేస్తూ వాటిని పూజించే విధానాన్ని తెలియజేస్తూ వాటిని పసుపు కుంకుమలతో అలంకరించి వాటికి ప్రత్యేకమైన ధాన్యాన్ని గ్రాసాన్ని అందించారు ఈ మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో విశేష సంఖ్యలో ఆంధ్ర తెలంగాణ నుండి భక్తులు గురుదాముకు విచ్చేసి వేడుకల్లో పాల్గొన్నారు.