సంక్రాంతి పండుగ మూడు రోజులపాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరిగిన మద్యం అమ్మకాలు ఊహించని విధంగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే అధికంగా ఈ విక్రయాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది మూడు రోజుల అమ్మకాలు ఒక్కసారి పరిశీలిస్తే రూ 12. 78 కోట్లుగా ఉంది. ఇందులో ఐఎంఎల్ సేల్స్ 14943 కేసులు ఉండగా, బీర్ కేసులు 2855 గానే ఉన్నాయి. ఆ ఏడాది లిక్కర్ సేల్స్లో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంటే, కృష్ణాజిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అమ్మకాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా ఐదవ స్థానానికి జారుకున్నప్పటికీ, గత ఏడాది కంటే 20 శాతానికి పైగా అమ్మకాలు జరిగాయి. పండగ మూడు రోజులపాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా రూ 15. 51కోట్ల మీర మధ్య అమ్మకాలు జరిగాయి. అయితే ఈ సంవత్సరం బీర్ సేల్స్ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐఎంఎల్ కేసులు 16666 అమ్మకం జరగగా, బీరు కేసులు 79 26 అమ్మకాలు జరిగాయి. ఏది ఏమైనప్పటికీ పండుగ మూడు రోజులు బాగా తాగిన మద్యం ప్రియులు ఖజానాకు మాత్రం కాసులకు ఇక్కును ఎక్కించారు.