ప్రధాని మోదీ జనవరి 19న కర్ణాటక, మహారాష్ట్రల్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తారని పీఎంవో మంగళవారం తెలిపింది.మహారాష్ట్రలో రూ. 38,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు ఏడు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల శంకుస్థాపన, రోడ్డు శంకుస్థాపన ప్రాజెక్టు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ పునరాభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు.జల్ జీవన్ మిషన్ కింద యాద్గిర్ బహుళ-గ్రామ తాగునీటి సరఫరా పథకానికి యాదగిరి జిల్లా కోడెకల్‌లో శంకుస్థాపన చేస్తారు. ఈ పథకం కింద 117 ఎంఎల్‌డి నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మించనున్నారు. రూ.2050 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు యాదగిరి జిల్లాలోని 700కు పైగా గ్రామీణ ఆవాసాలు, మూడు పట్టణాల్లోని దాదాపు 2.3 లక్షల ఇళ్లకు తాగునీరు అందించనుంది.ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నారాయన్‌పూర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ - ఎక్స్‌టెన్షన్ రెనోవేషన్ అండ్ మోడరనజేషన్ ప్రాజెక్ట్ (ఎన్‌ఎల్‌బిసి - ఇఆర్‌ఎం) ను కూడా ప్రారంభిస్తారు. 10,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న కాలువతో ఈ ప్రాజెక్ట్ 4.5 లక్షల హెక్టార్ల కమాండ్ ఏరియాకు నీరందించగలదు. కలబుర్గి, యాదగిరి, విజయపూర్ జిల్లాల్లోని 560 గ్రామాల్లోని మూడు లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు 4700 కోట్లు.ముంబైలో దాదాపు 400 కి.మీ రోడ్ల శంకుస్థాపన ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు. దాదాపు రూ.6,100 కోట్లతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ పునరాభివృద్ధికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.