లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తమ ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీను బ్రిటిష్ వైస్రాయ్తో పోల్చారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపి శిక్షణ ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఎల్జీ అడ్డుకుంటున్నారని విమర్శించారు. దీనిపై అసెంబ్లీలో వ్యాఖ్యానించడంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు.