ఇటీవలే నేపాల్ లో విమానం కుప్పకూలి 72 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో విమానానికి ప్రమాదం తప్పింది. న్యూజిలాండ్ లోని అక్లాండ్ నుండి సిడ్నీకి వెళ్తున్న క్వాంటాస్ విమానం ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇది ట్విన్ బోయింగ్ 737-800 విమానం. దీనిలో 100 మంది ప్రయాణికులు ఉండడంతో ఏటీసీ అలర్ట్ జారీచేసింది. విమానం ఇంజిన్ సమస్యతోనే ప్రయాణించి, సేఫ్ గా ల్యాండ్ అవడంతో పెను ప్రమాదం తప్పింది