టీమిండియా అండర్-19 క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విజయ్ జోల్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడితో పాటు మరో 19 మందిని అరెస్ట్ చేశారు. వీరిపై కిడ్నాప్, లూటీలు, అల్లర్లకు సంబంధించి కేసు నమోదు చేశారు. అయితే విజయ్ తండ్రి, సీనియర్ న్యాయవాది బావు సాహెబ్ మాత్రం తన కొడుకు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాడని, అయితే ఎలాంటి తప్పు చేయలేదన్నారు.