సీఎం జగన్ కళ్లలో ఆనందం చూడటానికే పోలీసులు టీడీపీ కార్యాలయాన్ని కూల్చడం వంటి పనులు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అదే స్థలంలో కార్యాలయం ఉందన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఫిర్యాదు ఇవ్వగానే తొలగించేశారన్నారు. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం జరగకూడదనే ఇదంతా చేశారని దేవినేని ఉమ విమర్శించారు.