ఆర్థిక మాంద్య భయాలతో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ లేఆఫ్‌లకు రంగం సిద్ధం చేస్తుంది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 6 వేల మంది ఉద్యోగుల్లో దాదాపు 8-10% మందిని తొలగించాలనుకుంటోందని సమాచారం. IPOకు ముందు కంపెనీని లాభాల్లోకి తీసుకురావడంలో భాగంగా సంస్థ ఈ చర్యలు చేపట్టనుందని తెలిసింది.