విద్యుత్ చార్జీలు పెంపు, స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకస్తూ సీపీఐ నిరసనకు దిగింది. గురువారం ఉదయం విశాఖపట్నం, గురుద్వారా జంక్షన్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గురుద్వారా వద్ద ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద సీపీఐ నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని... స్మార్ట్ మీటర్లు వద్దంటూ నేతలు నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణమూర్తి, నగర సీపీఐ నేతలు నిరసనలో పాల్గొన్నారు. సీపీఐ ఆందోళనల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.