తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఓ వ్యక్తి వద్ద గన్ కలకలం రేపింది. వన్‌టౌన్ పోలీసుల తనిఖీల్లో అమెరికా మేడ్ 9 ఎం.ఎం గన్‌తో కెళ్లా శ్రీనివాస్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. గన్‌తో బెదిరించి దందాలు చేసేందుకు కొత్తపేటకు చెందిన శ్రీనివాస్ ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విజయనగరానికి చెందిన స్నేహితుడి నుంచి శ్రీనివాస్ గన్ తెచ్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. తుపాకి ట్రయిల్ వేసేందుకు బయటకు తీసుకెళ్తూ పోలీస్ తనిఖీల్లో సదరు వ్యక్తి పట్టుబడ్డాడు. గన్‌తో పాటు ఏడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.