రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ... ప్రజలందరికీ ఉపయోగపడేలాగా పనిచేయాలని.. అటవీశాఖకు మంచి పేరు రావాలని కోరుకున్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత మేలు జరుగుతోందని చెప్పుకొచ్చారు. ‘‘నేను 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ రాలేదు. మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు’’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.