వైసీపీ దళిత ఎమ్మెల్యేలకు, మంత్రులకు నిజంగా అధికారం ఉన్నట్లయితే.. ఈ నెల 23తో పూర్తయ్యే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టo కాల పరిమితి పొడిగించేలా చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. వైసీపీ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు సంఖ్యా బలం ఉందని గర్వంగా చెప్పుకోవడం కాదని.. తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మేలు జరిగేలా చేయాలన్నారు. సబ్ ప్లాన్ చట్టం, అంబేద్కర్ స్టడీ సర్కిల్ వంటి విషయాలపై దళిత మంత్రులు ఎమ్మెల్యేలు పోరాటం చేస్తే మీకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన అంబేద్కర్ ఆత్మ శాంతిస్తుందని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.